: కర్నాటక సీఎంను హతమార్చమంటూ ట్వీట్... ప్రభుత్వోద్యోగి అరెస్టు!

కర్నాటక సీఎం సిద్ధరామయ్యను హతమార్చమంటూ ట్వీట్ చేసిన ఒక ప్రభుత్వోద్యోగిని పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇటీవల బళ్లారి పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రమేశ్ పై సీఎం చేయిచేసుకున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగి రోషన్ ఈ ట్వీట్ చేశారు. సిద్ధరామయ్యపై అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడంతోపాటు ఉగ్రవాదులెవరైనా ఆయన్ని చంపేసి తమకు మేలు చేయాలంటూ ఆయన సంచలనాత్మక ట్వీట్ చేశారు.

More Telugu News