: రెండేళ్లలో 4 వేల కొత్త బస్సులు: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు

ఏపీఎస్ ఆర్టీసీని బలోపేతం చేయనున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. గుంటూరు బస్టాండ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది 3 వేల బస్సులను అందుబాటులోకి తెచ్చేదిశగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సుల కోసం ఏటా వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. మరిన్ని నిధులు కేటాయించాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 423 బస్ స్టేషన్లలో 71 స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాల్లో బస్ స్టేషన్లను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని ఆయన వెల్లడించారు. 12.5 కోట్ల రూపాయలతో 17 బస్ స్టేషన్లను ఇప్పటికే ఆధునికంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News