: పని మనిషికి కోటి రూపాయలు ఇచ్చిన శిల్పి!

పనిమనుషుల చేత అడ్డమైన చాకిరీ చేయించుకుని వాళ్లను పశువుల కంటే హీనంగా చూసే మనుషుల్నీ చూస్తున్నాం... పని మనిషి తనకు చేసిన సేవకు కృతజ్ఞతగా ఆమె పేర బ్యాంకులో కొంత డబ్బు వేసిన సినీ నటుడు రంగనాథ్ వంటి మానవత్వం వున్న మనుషులనూ మనం చూస్తున్నాం. అయితే, ఈ రెండో రకం మనుషులు సమాజంలో తక్కువగా కనిపిస్తారు. ఇటీవలి మరణించిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి జెరామ్ పటేల్ (86) కూడా ఆ కోవకే చెందుతారు. అవసాన దశలో ఆయన పక్షవాతం బారినపడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పట్టించుకోవడం మానేశారు. 12 ఏళ్ల వయసులో జెరామ్ పటేల్ ఇంట్లో పనికి కుదిరిన దయాబాయ్ (54) మాత్రమే ఆయనకు సపర్యలు చేశారు. అన్నీ తానై ఆయన చివరి దశలో యజమానిని చూసుకున్నారు. దీనికి కృతజ్ఞతగా ఆయన దయా బ్యాంకు అకౌంట్ లో కోటి రూపాయలు జమ చేశారు. అంతే కాకుండా తన ఆస్తిలో కొంత వాటాను కూడా అతని పేరిట రాశారు. ఇలా కేవలం దయాకు మాత్రమే కాకుండా తన ఇంట్లో పని చేసిన ప్రతి వ్యక్తి బ్యాంకు అకౌంట్లలోను భారీ మొత్తం జమ చేశారాయన. దీంతో పటేల్ సాబ్ కు సేవ చేయడం తన అదృష్టమని దయా చెప్పారు. ఆయన తమకు అంత మొత్తం ఇవ్వడం ఆయన ఔదార్యమని చెప్పారు. కాగా, ఆయన ఆరు కోట్ల విలువ చేసే కళాఖండాలు, శిల్పాలను అతి తక్కువ రేటుకి ఢిల్లీలోని కిరణ్ నాదార్ మ్యూజియంకి ఇచ్చేశారు.

More Telugu News