: ‘సెన్సార్’ సంస్కరణ ప్యానెల్ సభ్యుడిగా కమలహసన్... గౌతం ఘోష్ కూడా!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్... షార్ట్ కట్ లో మనం పిలుచుకునే సెన్సార్ బోర్డు సమూల ప్రక్షాళన బాధ్యతలు చేపట్టిన శ్యాం బెనగల్ కమిటీలో దక్షిణాది నటుడు కమలహసన్ కు కూడా చోటు దక్కింది. కమల్ తో పాటు ప్రముఖ బెంగాలీ దర్శకుడు గౌతం ఘోష్ ను కూడా సభ్యుడిగా నియమిస్తున్నట్లు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కమిటీ చైర్మన్ శ్యాం బెనగల్ ప్రకటించారు. దేశంలో ఆయా ప్రాంతీయ భాషా సినీ రంగాలకు చెందిన వారికి ప్రాధాన్యమివ్వాలన్న భావనతోనే కమల్, ఘోష్ లకు కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు బెనగల్ చెప్పారు.