: నారాయణ్ ఖేడ్ బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

వచ్చే నెల 13న తెలంగాణలోని మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంజీవ్ రెడ్డిని పోటీకి దింపుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఇక్కడి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి మరణించడంతో ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. కిష్టారెడ్డి కుమారుడే సంజీవ్ రెడ్డి. ఇక అభ్యర్థి మరణిస్తే, పోటీకి నిలుపరాదన్న సంప్రదాయాన్ని మిగతా పార్టీలు పాటిస్తే, సంజీవ్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే. అలా కాకుండా టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించితే, పరిస్థితి ఏ మలుపైనా తిరగవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలకు 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా, ఫిబ్రవరి 16న లెక్కింపు జరుగనుంది.

More Telugu News