: శరణార్థిగా వచ్చి సూసైడ్ బాంబర్ గా మారి..!

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ పై బాంబులు విసిరి, ఆపై ఆత్మాహుతి దాడి చేసుకున్న యువకుడి గురించి విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అతను కేవలం వారం రోజుల క్రితం శరణార్థి రూపంలో టర్కీకి వచ్చినట్టు అధికారులు కనుగొన్నారు. సౌదీలో జన్మించిన నబిల్ ఫాడ్లీ అనే వ్యక్తి, ఆపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరి, టర్కీకి వలస వచ్చాడని అధికారులు పేర్కొన్నట్టు టర్కీ మీడియా వెల్లడించింది. దీంతో ఇంకెంతమంది ఉగ్రవాదులు ఇదే రూపంలో వచ్చారోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బుధవారం జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 10 మందికి పైగా చనిపోగా, మరెంతో మంది గాయపడ్డ సంగతి తెలిసిందే.

More Telugu News