: ఉగ్ర భయంతో సిడ్నీ ఒపేరా హౌస్ మూసివేత

ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలోని ప్రధాన పర్యాటక ప్రాంతం సిడ్నీ ఒపేరా హౌస్ ను ఉగ్రదాడి భయాలతో తాత్కాలికంగా మూసివేశారు. ఒపేరా హౌస్ వద్ద అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు పర్యాటకులను పంపించి తనిఖీలు చేపట్టారు. అక్కడి స్థానిక మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, పోలీసులకు అందిన సమాచారం, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం, అవాస్తవమై ఉండవచ్చని అంచనా. ఇప్పటివరకూ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం.

More Telugu News