: ఐఎంఎఫ్ తో ఆటలొద్దు: గ్రీస్ ను హెచ్చరించిన ఈయూ

రుణాలు తీసుకునేటప్పుడు అన్ని నిబంధనలకూ అంగీకరించి, ఆపై వాటిని పాటించడంలో అలసత్వం చూపిస్తున్న గ్రీస్ పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) మండిపడింది. అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆటలు ఆడొద్దని హెచ్చరించింది. గ్రీస్ ను కష్టాల నుంచి బయటపడేసేందుకు కృత నిశ్చయంతో ఐఎంఎఫ్ ఉండగా, గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ వైఖరి ఇబ్బందికరంగా మారిందని ఈయూ వ్యాఖ్యానించింది. పన్ను నిబంధనలను అమలు చేయాలని, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తామన్న నమ్మకాన్ని కలిగించాలని కోరింది. అలెక్సిస్ తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించింది.

More Telugu News