: మహారాష్ట్రలో గత ఏడాది 3,228 రైతు ఆత్మహత్యలు
మహారాష్ట్రలో రోజురోజుకు రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కేవలం రెండు నెలల్లో ఏకంగా 610 మంది రైతులు ఆత్మహత్యలు చోటుచేసుకోవడం అక్కడి రైతుల దుర్భర పరిస్థితికి దర్పణం పడుతుంది. రాష్ట్రంలో 2015లో రికార్డు స్థాయిలో రైతు ఆత్మహత్యలు జరిగాయి. 2015లో అక్టోబరు వరకూ 2,590 ఆత్మహత్యలు నమోదు కాగా, నవంబరు, డిసెంబరు నెలలలో ఏకంగా 610 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వపు రికార్డుల ప్రకారం 2001 నుండి ఇప్పటివరూ 20,504 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని విదర్భలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది అమరావతి, నాగ్ పూర్ ప్రాంతాలకు చెందిన 1,542 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రైతులకు ప్రకటించిన ప్యాకేజీలు వారిని ఆదుకోకపోవడమే ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.