: అన్నాడీఎంకే సమావేశంలో బాంబులు!
తమిళనాడులోని మధురైలో అధికార అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల సమావేశం జరగనున్న వేళ, పోలీసుల తనిఖీల్లో నాటు బాంబులు, పెట్రోలు బాంబులు బయటపడటంతో కలకలం రేగింది. నిన్న రాత్రి సమావేశం జరగడానికి ముందు రెండు బాంబులను కనుగొన్న పోలీసులు, ఆపై సమావేశం జరిగిన తరువాత మరో రెండు బాంబులను గుర్తించారు. ఇవి పేలక పోవడంతో ఎటువంటి ప్రమాదమూ జరుగలేదు. కాగా, రెండు రోజుల క్రితం తమిళ మంత్రి సెల్లూరు రాజు నివసించే ఇంటిపై ఆగంతకులు పెట్రోల్ బాంబులు విసిరిన సంగతి తెలిసిందే.