: వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ఉమ్మడి హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. గతేడాది చివరిలో తిరుపతి విమానాశ్రయంలో ఎయిరిండియా ఉన్నతోద్యోగిపై మిధున్ రెడ్డి దౌర్జన్యం చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది. ఈ నెల 31న ఆయన పోలీసుల ఎదుట హాజరు కావల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయమూర్తి జైస్వాల్ నిరాకరించారు. కాగా ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలోనే అరెస్టు కాగా, తరువాత బెయిల్ పై విడుదలయ్యారు.

More Telugu News