: ఉగ్రవాదుల ముసుగులో పాక్ ఆర్మీ అధికారులు: ఆఫ్గాన్ పోలీసు అధికారి

ఆఫ్ఘనిస్తాన్ లోని భారత్ కాన్సులేట్ పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు కూడా ఉన్నారని ఆఫ్ఘాన్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆప్ఘనిస్తాన్ నార్త్ రన్ బాల్క్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ సయ్యద్ కమాల్ సదాత్ మీడియాతో మాట్లాడుతూ, జనవరి 3వ తేదీన మజార్-ఈ-షరీఫ్ లో ఉన్న భారత్ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ సరిహద్దుల్లోని మిలిటరీ అధికారులేనని ఆయన ఆరోపించారు. వాళ్లల్లో చాలామంది ఆఫ్ఘాన్ భద్రతా దళాలతో సరిహద్దుల్లో తలపడిన వారేనని అన్నారు. భారత్ కాన్సులేట్ పై దాడికి పాల్పడిన వారిలో 99 శాతం మంది పాక్ మిలిటరీ అధికారులేనని, వాళ్లందరిని తన కళ్లతో చూశానని చెప్పారు. ప్రత్యేకమైన ఎత్తుగడలతో ఈ దాడికి వారు పాల్పడ్డారని అన్నారు. ‘వాళ్లందరూ బాగా చదువుకున్నవారు. అల్లా దయవల్ల వాళ్లను మేము తిప్పికొట్టాము..నియంత్రించాము.. వెనుదిరిగేలా చేశాము’ అని సదాత్ పేర్కొన్నారు.

More Telugu News