: సినిమా నిర్మాణానికి రిటైర్మెంట్ ప్రకటించిన స్రవంతి రవి కిశోర్!
ప్రముఖ సినీ నిర్మాత స్రవంతి రవికిశోర్ రిటైర్మెంట్ ప్రకటించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై 'మహర్షి', 'బలరామకృష్ణులు', 'నువ్వు నాకునచ్చావ్', 'నువ్వే నువ్వే', 'రెఢీ', 'నేను శైలజ' వంటి విజయవంతమైన సినిమాలను స్రవంతి రవికిశోర్ నిర్మించారు. 'నేను శైలజ' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక నిర్మాణ రంగం నుంచి విరమించుకుంటున్నానని చెప్పారు. తాను విరమించుకుంటున్నా స్రవంతి మూవీస్ బ్యానర్ పై సినిమాల నిర్మాణం ఆగదని ఆయన తెలిపారు. ఇకపై స్రవంతి మూవీస్ బ్యానర్ ను సినీ నటుడు రామ్ సోదరుడు కృష్ణ చైతన్య చూసుకుంటారని ఆయన చెప్పారు. 'నేను శైలజ' డైరెక్టర్ తో రామ్ హీరోగా మరో సినిమా నిర్మిస్తారని, దాని నిర్మాణ బాధ్యతలు కృష్ణ చైతన్య చూసుకుంటారని ఆయన వెల్లడించారు.