: విమానం ఎక్కాలంటే మూడు గంటల ముందుండాలి: ఎయిర్ ఇండియా

ఇండియాలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీ చెకింగ్స్ మరింత కట్టుదిట్టంగా ఉన్న నేపథ్యంలో తమ విమానాల్లో ప్రయాణించే వారు కనీసం 3 గంటల ముందుగా ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా సూచించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రయాణికుల భద్రత, రక్షణకు పెద్ద పీట వేస్తున్న ఎయిర్ లైన్స్ గా వారి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, ప్రస్తుతం విమానం బయలుదేరే సమయానికి దేశవాళీ ప్రయాణమైతే 45 నిమిషాలు ముందుగా, విదేశీ ప్రయాణమైతే గంట ముందుగా చెకిన్ కౌంటర్లు మూసివేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఫ్లయిట్ బోర్డింగ్ గేట్లను 25 నిమిషాల ముందే మూసి వేస్తామని, గంట ముందుగానే దేశీయ, విదేశీ చెకిన్ కౌంటర్లను మూసి వేస్తామని కూడా ఎయిర్ ఇండియా తెలిపింది. విదేశీ ప్రయాణికులు మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది.

More Telugu News