: 2 జీబీ రామ్, 16 జీబీ మెమొరీ, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ... రూ. 7 వేలకు రెడ్ మీ 3
అధునాతన ఫీచర్లతో కూడిన మరో ఆకర్షణీయ స్మార్ట్ ఫోన్ అందుబాటు ధరలో మార్కెట్లోకి వచ్చింది. జియోమీ సంస్థ రెడ్ మీ సిరీస్ లో మూడవ ఫోన్ ను సుమారు రూ. 7 వేల ధరకు మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోన్ ఏ క్షణమైనా ఇండియాకు రానుంది. 5 అంగుళాల డిస్ ప్లే, 1.2 జీహెచ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ రామ్, 13/5 మెగాపిక్సెల్ కెమెరాలు, 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ లతో పాటు, కనీసం రెండు రోజుల పాటు నిలిచివుండేలా 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్ మీ 3కి అదనపు ఆకర్షణ. మెటల్ టెక్చర్డ్ బాడీతో చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఫోన్, ఆండ్రాయిడ్ వర్షన్ పై పనిచేస్తూ, 4జీ కనెక్టివిటీకి మద్దతిస్తుంది. బంగారం, వెండి, బూడిద రంగుల్లో లభించే దీని బరువు కేవలం 144 గ్రాములు మాత్రమే.