: అమ్మకానికి సత్య నాదెళ్ల రాజ ప్రాసాదం... 35 లక్షల డాలర్లుంటే కొనేయొచ్చు!
మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల ముచ్చటపడి కొనుక్కున్న రాజప్రాసాదం లాంటి భవంతి అమ్మకానికి వచ్చింది. అమెరికాలోని సియాటెల్ లోని తన ఇంటిని అమ్మేసేందుకు ఆయన దాదాపుగా సిద్ధపడ్డారు. ఈ మేరకు ఈ భవనం రెండు రోజుల క్రితం ‘రెడ్ పిన్’లో లిస్టయింది. నాలుగు పడక గదులున్న సదరు ఇల్లు దాదాపు 4 వేల చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. సువిశాల భవంతిగా ఉన్న దీనికి ఓపెన్ ప్లేస్ కూడా బాగానే ఉందట. 1963లో కట్టిన ఈ భవంతిని 2000 సంవత్సరంలో 14 లక్షల డాలర్లు పెట్టి కొనుక్కున్న సత్య నాదెళ్ల, తన అభిరుచికి అనుగుణంగా దానికి భారీ మార్పులు చేర్పులు చేయించారు. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఈ ఇంటిలో నివసించిన సత్య నాదెళ్ల తాజాగా సియాటెల్ లోనే మరో ఇంటికి మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమ్మకానికి పెట్టిన తన ఇంటికి ఆయన 34.88 లక్షల డాలర్ల ధరను ప్రతిపాదించారు.