: బ్రిటీష్ పాలనకన్నా ఇందిరమ్మ శాననాలు కఠినం... బీహార్ వెబ్ సైట్ ఆరోపణ... కాంగ్రెస్ ఆక్షేపణ!
బీహార్ ప్రభుత్వానికి చెందిన ఒక వెబ్ సైట్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శాసనాలు బ్రిటన్ శాసనాలకన్నా కఠినంగా ఉండేవని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలతో బీహార్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్ చరిత్రపై రూపొందించిన సమీక్షలో దేశంలో ఇందిరా గాంధీ నిరంకుశ శాసనాలు అమలు చేశారని, ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఆమె దమన కాండ సాగించిందంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే ఈ సమీక్షలో ఆధునిక చరిత్రలో జయప్రకాష్ నారాయణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ, జేపీ నిరంతరం ఇందిరా గాంధీ నిరంకుశ పాలనను వ్యతిరేకించారని, అలాగే సంజయ్ గాంధీ తీరును ఎండగడుతుండేవారని పేర్కొన్నారు.