: పరిశ్రమలకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తాం!: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖపట్టణంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే సువిశాల సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతమని అన్నారు. కేవలం తీర ప్రాంతాన్ని బలంగా మార్చుకున్న చైనా పారిశ్రామిక విప్లవం సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కూడా చైనాతో సరిపోలుతుందని అన్నారు. ఇక్కడి ప్రజలు కష్టించి పని చేస్తారని ఆయన చెప్పారు. పరిశ్రమల అనుమతికి అనవసర నిబంధనలు తొలగించి కేవలం 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రమని ఆయన చెప్పారు. అపారమైన వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రహదారులు, జలరవాణా మార్గాలు అభివృద్ధి చేస్తామని ఆయన పారిశ్రామిక వేత్తలకు తెలిపారు.

More Telugu News