: పఠాన్ కోట్ ఘటనపై స్పందించిన చైనా

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడిని చైనా ఖండించింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన తర్వాత స్పందించిన చైనా ఉగ్రదాడిపై భారతీయుల ఆగ్రహాన్ని పంచుకుంటున్నామని పేర్కొంది. పఠాన్ కోట్ దాడి కారణంగా భారతీయులకు కలిగిన ఆవేదన, ఆగ్రహాన్ని తాము కూడా పంచుకుంటున్నామని చైనా భారత రాయబారి లీ యూ చెంగ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానిని ఖండిస్తామని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించారు. చైనా కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని ఈ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

More Telugu News