: విశాఖపట్టణం ఎందుకు సురక్షితమంటే...!: అనిల్ అంబానీ

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణం ఎందుకు సురక్షితమంటే...ఇక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం లేదు. శాంతి భద్రతలు ఎక్కడ అదుపులో ఉంటాయో అక్కడ అభివృద్ధి సాధ్యమని ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ తెలిపారు. విశాఖపట్టణంలోని సీఐఐ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడని అన్నారు. హైదరాబాదును ఆ స్థాయిలో అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని అన్నారు. విశాఖపట్టణంలో ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన నేవీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని తెలిపారు. కోస్తా తీరం మొత్తాన్ని ఇక్కడి నుంచే నేవీ పర్యవేక్షిస్తుందని, ఇది అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతమని ఆయన చెప్పారు. విశాఖపట్టణం పెట్టుబడులకు ఎంత అనుకూలమో, ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ పలు కార్యక్రమాల ద్వారా వివరించారని ఆయన తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రధాని మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా పరిపుష్టి చేసినవారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News