: అయోధ్య.. మహ్మద్ ప్రవక్త జన్మ స్థలం కాదు!: యోగా గురు రాందేవ్ బాబా ట్వీట్స్

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నిన్న సంచలన ప్రకటన చేశారు. మహ్మద్ ప్రవక్త జన్మ స్థలం అయోధ్య కాదని ఆయన తేల్చిచెప్పారు. హిందువుల ఆరాధ్య దైవం రాముడు అయోధ్యలోనే జన్మించారని చెప్పిన రాందేవ్, ముస్లింలు తమ దేవుడిగా భావిస్తున్న మహ్మద్ ప్రవక్త మాత్రం అయోధ్యలో జన్మించలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో సంచలన కామెంట్లను పోస్ట్ చేశారు. ‘‘రాముడు మనకు ఆరాధ్యుడు. అయోధ్య రాముడి జన్మ స్థలమన్న విషయాన్ని ప్రతి హిందువు, ముస్లిం గుర్తించాలి. అదే సమయంలో అయోధ్యలో మహ్మద్ ప్రవక్త జన్మించలేదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి’’ అని రాందేవ్ ట్వీటారు.

More Telugu News