: తాగునీటి సరస్సుల రక్షణకు నడుం బిగించిన సినీ నటుడు కార్తీ
తాగునీటి సరస్సులను సంరక్షించుకోవాలని దక్షిణాది నటుడు కార్తీ ప్రజలకు పిలుపు నిచ్చారు. తమిళనాడులోని సేలంలో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాగునీటి సరస్సులోని వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్తీ పాల్గొన్న విషయాన్ని ఆయన సోదరుడు, నటుడు సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు.