: తిక్క పవన్ కు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారు!: టీఆర్ఎస్ ఎంపీ కవిత
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిజామాబాద్ ఎంపీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారన్న వార్తలపై హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ, "సెటిలర్ల ఓట్ల కోసం బీజేపీ-టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయిస్తారట. తిక్క పవన్ కు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారు. మేకప్ తో ప్రచారానికి వచ్చే పవన్ ఎన్నికలు ముగిసిన తరువాత ప్యాకప్ చెప్పి వెళ్లిపోతారు. అది ఆయనకు అలవాటే. కానీ మేము పప్పన్నం తినైనా ప్రజలతోనే ఉంటాం" అని కవిత విమర్శలు చేశారు. మరీ వ్యాఖ్యలపై పవన్, టీడీపీ-బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.