: చట్టసభల్లో సభ్యులు సహృదయంతో మెలగాలి: వెంకయ్యనాయుడు

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-19 జాతీయ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, చట్టసభల్లో సభ్యులు అసభ్యకర పదజాలం వాడుతున్నారన్నారు. ప్రజలు బజారు సరుకును అసెంబ్లీ, పార్లమెంటుకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు. వారంతా చట్టసభల్లో రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాజకీయ నాయకులు సహృదయంతో మెలగాలని వెంకయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీలు కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.

More Telugu News