: హైదరాబాదుకు టీఆర్ఎస్ ఏం చేసిందో తెలుసా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎన్నికల్లో విజయం సాధించి, అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ హైదరాబాదుకు ఏం చేసిందో తెలుసా? అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తర్వాత ఆయనే చెబుతూ, కాంగ్రెస్ చేపట్టిన మెట్రో ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పిల్లర్లను ఫ్లెక్సీలుగా మార్చేసిందని అన్నారు. అలాగే ఎప్పుడో పూర్తి చేయాల్సిన మెట్రో రైల్ ప్రాజెక్టును తాత్సారం చేస్తూ ఆలస్యం చేసిందని అన్నారు. ఎప్పుడో ఆమోదం పొందిన అలైన్ మెంట్ ప్లాన్ ను మార్చివేసి ప్రజల షాపులు కూలగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికల ముందు ఆంధ్రావారిని తరమికొట్టాలని పిలుపునిచ్చి ఇప్పుడు ఆంధ్రవాళ్లను పొగడడం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

More Telugu News