: ఐపీఎల్ లో ఆడాలని ఉంది...అనుమతి రాలేదు: మిచెల్ స్టార్క్

ఐపీఎల్ సీజన్ 9లో ఆడాలని ఉందని ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ ఆకాంక్ష వ్యక్తం చేశాడు. గత నవంబర్ లో న్యూజిలాండ్ తో ఆడిన సందర్భంగా స్టార్క్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం స్టిక్స్ సాయంతో మైదానంలోకి అడుగిడిన స్టార్క్ ను చూసి అభిమానులు క్షోభపడ్డారు. మోకాలి గాయంతో తాజాగా భారత్ తో జరగనున్న సిరీస్ కు దూరమైన స్టార్క్ ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 9 సీజన్ కల్లా కోలుకుంటానని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపాడు. అయితే స్టార్క్ ఆడేందుకు ఆసీసీ బోర్డు ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని వాపోయాడు. కాగా, ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున మిచెల్ స్టార్క్ ఆడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News