: శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. ఇక్కడ పొందూరు మండలంలోని పుల్లాజీపేట, దెల్లిపేట, కృష్ణాపురం, లోలుగు గ్రామాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ఆ గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలో ఇప్పటివరకు నెల వ్యవధిలోనే నాలుగుసార్లు ప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు భూప్రకంపనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

More Telugu News