: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం

తమిళనాడులోని తిరునల్వేలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓమ్ని బస్సు బోల్తా పడి 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు చిదంబరం నుంచి నాగర్‌కోయిల్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News