: ఎస్పీ సల్వీందర్ సింగ్ కు పాలిగ్రఫీ టెస్టులు చేయనున్న ఎన్ఐఏ

పఠాన్ కోట్ ఘటనపై అసంబద్ధ సమాధానాలిస్తున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కు జాతీయ దర్యాప్తు విభాగం పాలిగ్రఫీ టెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. సల్వీందర్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఎన్ఐఏ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. పఠాన్ కోట్ లో ఉగ్రవాద దాడి జరగకముందు ముష్కరులు ఎస్పీకి చెందిన ఎస్.యు.వి వాహనాన్ని బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ సమయంలో ఎస్పీ తన స్నేహితులతో కలిసి సమీపంలోని ఒక గ్రామానికి వెళుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాను అక్కడి నుండి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని చెప్పాడు. అయితే ఈ విషయంలో ఆయన చెబుతున్న దానిలో పొంతన లేకపోవడంతో అతని చుట్టూ అనుమానాలు ముసురుకున్నాయి. దీంతో ఎన్ఐఏ అతనికి పాలిగ్రఫీ టెస్టులు చేసి నిజానిజాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది.

More Telugu News