: దాసరికి రాజ్యసభ సీటును ఆఫర్ చేసిన జగన్!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన కాపు నేత లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చన్న ఆలోచనతో దర్శకరత్న దాసరి నారాయణరావును కలిసి చర్చించిన వైఎస్ జగన్, ఆయనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో తమ పార్టీకి రాజ్యసభ సీటు దక్కనుందని, తమ పార్టీలో చేరితే, దాన్ని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని దాసరికి జగన్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ విషయమై అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇరుక్కుని ఉండటం, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయంగా బలహీనపడటంతో వైకాపాలో చేరేందుకు దాసరి కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న వారిద్దరి సమావేశం అనంతరం, దాసరి మీడియా ముందు జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.