: పాత ఐఫోన్ వేగం పెరిగేందుకు చిట్కా!
పాత ఐ ఫోన్ వేగం పెరిగేందుకు తక్షణం చేయాల్సిన పనేంటో తెలుసా? ఐ ఫోన్ లో యాప్ స్టోర్ కు వెళ్లి క్యాచ్ మెమొరినీ శుభ్రం చేయాలని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డెవలపర్ జచరిడ్రైయెర్ సూచిస్తున్నారు. పాత మొబైల్ ఫోన్ వేగం తక్కువగా ఉండటానికి కారణం 'ఐఓఎస్ 9' అని చెప్పారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పైన చెప్పిన విధంగా చేస్తే చాలని అన్నారు. ఈ విధంగా చేసే సమయంలో ఫోన్ స్క్రీన్ కొద్ది సమయం తెలుపు రంగులోకి మారుతుందని, మెయిన్ యాప్ స్టోర్ పేజీ రీబూట్ తర్వాత మెమొరీ శుభ్రం అవుతుందని జచరిడ్రైయెర్ పేర్కొన్నారు.