: డేటింగ్ కాదు బామ్మా...నెర్డీలా తయారవ్వాలి: జుకెర్ బర్గ్ సలహా
"సాధారణ అమ్మాయి అసాధారణమైన ధనవంతురాలు కావాలంటే ఏం చెయ్యాలని అడిగిన నా మనవరాలికి నెర్డీ (భూతద్దాల్లాంటి కళ్లజోళ్లు తగిలించుకుని ఎప్పుడూ కంప్యూటర్ తో కుస్తీపట్టే వ్యక్తి)తో డేటింగ్ చేసి వివాహం చేసుకోవడమేనని సలహా ఇచ్చా. అలాంటి వాళ్లు సాధారణంగా కనిపించినా అసాధారణ తెలివి తేటలతో డబ్బు బాగా సంపాదిస్తారు. ఏమంటావ్?' అంటూ ఓ బామ్మ అడిగిన ప్రశ్నకు ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.
'నెర్డీతో డేటింగ్ కంటే నెర్డీలా తయారైతే ఇంకా బాగుంటుంది బామ్మగారూ' అంటూ చమత్కారంగా చెప్పినా మంచి సలహాతో కూడిన సమాధానం ఇచ్చాడు. 'ఏ ఆధారం లేకున్నా మహిళలు వారంతట వారే నిలదొక్కుకునేలా తయారు చేయడం ఉత్తమం' అని పేర్కొన్నాడు. అతని సమాధానానికి సోషల్ మీడియాలో లైకులు వెల్లువెత్తుతున్నాయి.