: ఈ 'అప్పుల అప్పారావు'దో చిత్రమైన రికార్డు!


ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన 'అప్పుల అప్పారావు' సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కనపడ్డ ప్రతి వ్యక్తిని అప్పులడిగి భయపెడతాడు. అచ్చం అలా కాదు కానీ, అమెరికాలో కూడా ఓ అప్పుల అప్పారావు ఉన్నాడు. శాంటాకార్లాలోని వాల్టర్ కావగాన్ ది విశాల హృదయం. ఎందుకంటే, ఎవరైనా క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తే నాకెందుకు? అనడు. ఎవరిచ్చినా తీసుకుంటాడు. ఇలా అతని దగ్గర మొత్తం 1497 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 1.7 మిలియన్ డాలర్ల అప్పు తీసుకోవచ్చు. అత్యధిక క్రెడిట్ కార్డులు కలిగిన వ్యక్తిగా ఇతని పేరిట గిన్నిస్ రికార్డు కూడా ఉంది. 1960లో వాల్టర్ కావగాన్ తో అతని స్నేహితుడు పందెంకాశాడు. ఏడాది ముగిసేలోపు ఎవరైతే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉంటారో వారు విజయం సాధించినట్టు అన్నాడు. ఓడిన వారు గెలిచిన వారికి డిన్నర్ ఇవ్వాలి అని పందెం కట్టాడు. దీంతో వాల్టర్ 143 క్రెడిట్ కార్డులు సంపాదించగా, ఆయన స్నేహితుడు కేవలం 138 క్రెడిట్ కార్డులు మాత్రమే సంపాదించగలిగాడు. దీంతో ఓడిన స్నేహితుడు డిన్నర్ ఇప్పించాడు. అప్పటి నుంచి వాల్టర్ క్రెడిట్ కార్డులు తీసుకుంటూనే ఉన్నాడు. పెట్రోల్ బంక్, రెస్టారెంట్, ఎయిర్ లైన్స్, బార్... ఇలా ఏ సంస్థ క్రెడిట్ కార్డు ఇచ్చినా అది వాల్టర్ దగ్గర ఉండాల్సిందే. దీంతో ఇతనిని 'మిస్టర్ ప్లాస్టిక్ ఫెంటాస్టిక్'గా పిలుస్తున్నారు. అయితే ఇతని వద్ద ఇన్ని కార్డులు ఉన్నా ఒక్క కార్డు కూడా డిక్లైన్ కాకపోవడం విశేషం!

  • Loading...

More Telugu News