: మీ కార్లేమైనా ఆక్సిజన్ విడుదల చేస్తాయా?: మెర్సిడిస్ ను ప్రశ్నించిన సుప్రీం

"మీ వాహనాలేమైనా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయా?" మెర్సిడిస్ బెంజ్ సంస్థను సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న ఇది. ఢిల్లీలో నిలిపివేసిన డీజెల్ వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి తమ కార్లకు మినహాయింపును ఇవ్వాలని కోరుతూ టయోటా, మెర్సిడిస్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు సుప్రీంను ఆశ్రయించిన వేళ, కారు ఖరీదెంతైనా విడుదల చేసేది కాలుష్య కారకాలేనని అభిప్రాయపడింది. వాహన సంస్థల పిటిషన్లన్నింటినీ తోసిపుచ్చుతూ, మార్చి 31 వరకూ 2000 సీసీ కన్నా అధిక ఇంజన్ సామర్థ్యమున్న కార్ల రిజిస్ట్రేషన్ ను నిలపాల్సిందేనని స్పష్టం చేసింది. అంతకుముందు మెర్సిడిస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, హైఎండ్ కార్లతో పర్యావరణానికి పెద్దగా హాని జరగదని తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించని సుప్రీంకోర్టు, అందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే సమర్పించాలని కోరింది. "2000 సీసీ కన్నా అధిక పవర్ కార్లను ఎవరు వాడుతున్నారు? ధనవంతులేగా? డీజెల్ వాహనాలు తక్కువ కాలుష్యకారకాలని మీరు చెబుతున్నారు. అంటే మీ వాహనాలు ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయా?" అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

More Telugu News