: పాట చిత్రీకరణలో 'గొంతు' పోగొట్టుకున్న బాలీవుడ్ నటుడు గిరీష్ కుమార్

బాలీవుడ్ లో వర్ధమాన నటుడిగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న గిరీష్ కుమార్ (రామయ్యా వస్తావయ్యా ఫేమ్) 'లవ్ షుదా' చిత్రం షూటింగ్ సందర్భంగా తన గొంతును పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే, ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా 'పీనే కీ తమన్నా...' అనే పాట చిత్రీకరణలో ఓ సీన్ లో అతని నోట్లో మద్యం పోయాల్సిన సన్నివేశం ఒకటుంది. ఈ సీన్ బాగా పండాలని భావించిన గిరీష్, నృత్య దర్శకుడితో చర్చించి నిజమైన మద్యం సేవించాలని నిర్ణయించుకున్నాడు. పాటలో నర్తిస్తున్న కొందరు అతని నోట్లో కొయినా పెట్టి మద్యం పోసిన వేళ, మోతాదు ఎక్కువై అతని స్వర పేటిక దెబ్బతినగా, తాత్కాలికంగా గిరీష్ గొంతు మూగబోయింది. దీంతో షూటింగ్ కు పేకప్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడీ న్యూస్ పై బాలీవుడ్ లో ఎడతెగని చర్చ జరుగుతోంది.

More Telugu News