: వారంతా ఆత్మాహుతి దళ సభ్యులే: జైట్లీ
పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఆత్మాహుతి దళ సభ్యులేనని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులు కఠిన శిక్షణ అనంతరం ఎయిర్ బేస్ ను భారీగా దెబ్బతీయాలన్న లక్ష్యంతో దాడులకు ఉపక్రమించారని అన్నారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చాలా విశాలమైనదని, చిన్న పట్టణం పరిమాణం గల ఎయిర్ బేస్ లో సైన్యం ముమ్మర తనిఖీలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. ముందు ఉగ్రవాదుల ఏరివేత తరువాత పాకిస్థాన్ తో చర్చల విషయం ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులను సజీవంగా పట్టుకోవాలనే లక్ష్యంతో ఆపరేషన్ జరుగుతోందని ఆయన వెల్లడించారు.