: ఈ కాలంలో నోటికి తాళం వేయకపోతే.. బరువు పెరిగిపోతాము!
చలి కాలంలో... చెమట పట్టదు, దాహం ఎక్కువగా వేయదు, చర్మం ముడుచుకుపోతుంది, వ్యాయామం చేయాలనిపించదు. వాతావరణం చల్లగా ఉండటంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే, ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. ఇష్టమొచ్చినట్లు ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవడమే కాకుండా, బరువు పెరిగిపోతామని వైద్యులు చెబుతున్నారు. బరువు బారిన పడకుండా ఉండటానికి వైద్యులు చేస్తున్న కొన్ని సూచనలు... * తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం * పార్టీల్లో మితంగా తినడం * నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం * రాత్రి భోజనం మితంగా తీసుకోవాలి. ఒకవేళ నాన్ వెజ్ తీసుకుంటే పండ్లు, సలాడ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. * ఫ్రై వంటకాలకు దూరంగా ఉండాలి. * నెయ్యి (బరువు తగ్గాలనుకునేవారు)ని పక్కన పెట్టాల్సిందే * ఆకుకూరలు, పండ్లు, డ్రై ప్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం శీతాకాలంలో చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.