: భారత్ ను నాశనం చేయండి, హిందువులను చంపండి... అల్లా మనవెంటే!: ఇస్లాం మతపెద్ద సంచలన వీడియో

ఇస్లాం మతానికి, నిబంధనలకూ తీవ్ర వ్యతిరేకమైన విగ్రహారాధన చేస్తున్న ఇండియాను నాశనం చేయాలని బోధిస్తున్న ఇస్లాం మతపెద్ద, మాజీ బ్యాంకర్ ఇర్ఫాన్ ఉల్ హక్ కు చెందిన వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ కాలమిస్ట్, రచయిత తారీఖ్ ఫతే దీన్ని విడుదల చేశారు. భారత్ పై యుద్ధం చేస్తున్న పాకిస్థాన్ కు అల్లా తోడుంటాడని, హిందువులను హతమార్చాలని కూడా ఇర్ఫాన్ ఈ వీడియోలో అంటున్నట్టు ఉంది. కాగా, 2011లో ఇర్ఫాన్ ఈ ప్రసంగం చేసినట్టు తారీఖ్ చెబుతున్నారు. "ఇండియాపై యుద్ధం చేస్తున్న పాకిస్థానీలు అల్లా తమ వెంటే ఉన్నాడని భావించాలి. హిందువులపై యుద్ధం వారికి దేవుడిచ్చిన గౌరవం" అని ఇర్ఫాన్ అంటున్నాడు. ఈ వీడియో నిన్న యూట్యూబ్ లో అప్ లోడ్ కాగా, వేలాది మంది తిలకించారు.

More Telugu News