: అసోం సీఎంకు ప్రధాని మోదీ ఫోన్... భూకంప తీవ్రతపై ఆరా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కి ఫోన్ చేశారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం కారణంగా ఈశాన్య రాష్ట్రాలు సహా బంగ్లాదేశ్, మయన్మార్ లోని పలు ప్రాంతాలు కంపించిపోయాయి. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఓ వ్యక్తి చనిపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. క్షణక్షణానికి బాధితుల సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో భూకంపంపై సమాచారం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోదీ ఈశాన్య భారతంలోని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తరుణ్ గొగోయ్ కు ఫోన్ చేశారు. భూకంపం సంభవించిన తీరు, జరిగిన నష్టం, సహాయక చర్యలు, తాజా పరిస్థితిపై ఆయన గొగోయ్ తో మాట్లాడారు.