: వరంగల్ జిల్లాలో విద్యార్థినిపై విష ప్రయోగం!
వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై విష ప్రయోగం జరిగింది. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని టిఫిన్ బాక్స్ లో మరో బాలిక పురుగులమందు కలిపింది. ఈ విషాహారం తిన్న విద్యార్థినిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.