: కర్నూల్ జెడ్పీ చైర్మన్ సోదరుడిపై హత్య కేసు నమోదు

కర్నూల్ జెడ్పీ చైర్మన్ సోదరుడిపై హత్య కేసు నమోదైంది. దాబాలో మద్యం సేవించి డబ్బులు ఇవ్వకుండా జెడ్పీ చైర్మన్ సోదరుడు మల్లెల వెంకటరమణ, ఆయన అనుచరులు వెళ్లిపోయారు. డబ్బులు చెల్లించమని అడిగిన ధాబా కార్మికుడిని కారుతో ఢీకొట్టి చంపారన్న ఆరోపణలపై వెంకటరమణ సహా ఐదుగురిపై హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లెల వెంకటరమణ, ఆయన అనుచరుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

More Telugu News