: జపాన్ ను యుద్ధరహిత దేశంగా తీర్చిదిద్దుతా: షింజో అబె

జపాన్ ను యుద్ధరహిత దేశంగా తీర్చిదిద్దుతామని ఆ దేశ ప్రధాని షింజో అబె తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని దేశ ప్రజలకు ఆయన సందేశం ఇచ్చారు. పార్లమెంటు నూతన భద్రత చట్టం ఆమోదించిన నేపథ్యంలో జపాన్ దేశాన్ని యుద్ధరహితంగా ఉంచుతానని ఆయన ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత తొలిసారి జపాన్ పార్లమెంటు నూతన భద్రత చట్టం ఆమోదించింది. దీని ప్రకారం జపాన్ మిలిటరీ విదేశాల్లో యుద్దంలో పాల్గొనవచ్చు. దీనిపై ఆ దేశంలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News