: కేజ్రీ రూల్ బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ
ఢిల్లీలో నేటి నుంచి అమలవుతున్న సరి-బేసి సంఖ్యల విధానాన్ని బీజేపీ ఎంపీ బ్రేక్ చేశారు. గత కొంత కాలంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ మధ్య వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఢిల్లీలో సరి-బేసి సంఖ్యల నిబంధన అమలులోకి తీసుకొచ్చారు. గత నెల రోజులుగా ఈ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనను ప్రజలు అమలు చేస్తున్నారు. కానీ బీజేపీకి చెందిన ఎంపీ మాత్రం దీనిని ధిక్కరించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ సరి సంఖ్య నెంబర్ గల కారులో వెళ్తూ ఇండియా గేట్ వద్ద కనిపించారు.