: పార్లమెంటు క్యాంటీన్ లో రాయితీకి చెల్లుచీటి... నేటి నుంచి కొత్త రేట్లు అమలు

పార్లమెంటు క్యాంటీన్ లో సబ్సిడీలకు చెల్లుచీటి పడిపోయింది. ఎంపీలు, పార్లమెంటు సిబ్బంది, మీడియా, సందర్శకులకు నిన్నటిదాకా అత్యంత తక్కువ ధరకు లభించిన ఆహార పదార్థాలు నేటి నుంచి సాధారణ రేట్లకే అందనున్నాయి. పార్లమెంటు క్యాంటీన్ లోని సబ్సిడీ రేట్లపై వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రాయితీకి చెల్లుచీటి ఇస్తూ నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా పార్లమెంటుకు ఇకపై ఏటా రూ.16 కోట్ల మేర ఆదా కానుంది. ‘నో ప్రాఫిట్... నో లాస్’ పేరిట కొత్తగా అమలులోకి వచ్చిన రేట్ల ప్రకారం... పార్లమెంటు క్యాంటీన్ లో నిన్నటిదాకా రూ.18కే లభించిన శాకాహార భోజనం ఇకపై రూ.30 పలకనుంది. మాంసాహార భోజనం రేటు రూ.33 నుంచి రూ.60కి పెరిగింది. ఫుల్ మీల్స్ (త్రీ కోర్స్ మీల్స్) ధర రూ.61 నుంచి రూ.90కి పెరిగింది. చికెన్ కర్రీ కూడా రూ. 29 నుంచి రూ.40కి చేరింది.

More Telugu News