: దత్తాత్రేయ, కేటీఆర్ సమక్షంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల జగడం

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సాక్షిగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగడం కలకలం రేపుతోంది. కేటీఆర్ వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోకపోవడం విశేషం. వివరాల్లోకి వెళ్తే...హైదరాబాదులోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఎల్లిగుట్ట వద్ద మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్, బీజేపీ మంత్రులు, నేతలతో పాటు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో కార్యకర్తలు పరస్పర దూషణలకు దిగారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. మంత్రులు కేటీఆర్, పద్మారావు చెబుతున్నా పట్టించుకోకుండా కార్యకర్తలు పరస్పర ఘర్షణకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, కార్యక్రమం పూర్తి చేశారు.

More Telugu News