: మందేసి చిందెయ్యండి... నేడు రాత్రి 12 గంటల వరకూ వైన్స్: టీఎస్-ఎక్సైజ్

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ, రాత్రి 12 గంటల వరకూ తెలంగాణలోని మద్యం దుకాణాలు తెరచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. ఇక బార్లన్నీ రాత్రి ఒంటి గంట వరకూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. కాగా, ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకూ వైన్ షాపులు, 10:30 గంటల వరకూ బార్లకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం వేళ మందుబాబులు మరింతగా రెచ్చిపోయేలా ఈ తరహా ఆదేశాలేంటని పలువురు విమర్శిస్తున్నారు. అధిక ఆదాయంపై కన్నేసిన ఎక్సైజ్ అధికారులు మాత్రం, ప్రజలు నిరాశ చెందకూడదన్న ఉద్దేశంతో, తమకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

More Telugu News