: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు అనుమతి

హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశాన్ని ప్రజలకు కల్పించారు. సంబంధిత అధికారుల సమాచారం ప్రకారం, జనవరి 3 నుంచి 10 వ తేదీ వరకు ప్రజలు సందర్శించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సందర్శన వేళలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ విచ్చేసిన విషయం తెలిసిందే. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రేపటి వరకు ఆయన విడిది కొనసాగనున్న విషయం తెలిసిందే.

More Telugu News