: ట్రాఫిక్ పోలీసులూ.. వాహనదారులతో కఠినంగా ఉండకండి: కేజ్రీవాల్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులతో దురుసుగా ప్రవర్తించవద్దని..వారిపై ఎర్రలైటు వేయాలని.. పువ్వులు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం కేజ్రీవాల్ సూచించారు. వాయు కాలుష్య నివారణ నిమిత్తం ఆ రాష్ట్రంలో సరి-బేసి సంఖ్య పద్ధతి కొత్త ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈ సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనచోదకులతో కఠినంగా వ్యవహరించవద్దని, వారి మనస్సులు మార్చేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఇందుకుగాను ట్రాఫిక్ పోలీసులు చేతిలో ఎర్రలైటు, ప్లకార్డు పట్టుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎర్రలైటు వేసి.. చేతికి పువ్వులిచ్చి ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా కోరాలని సీఎం సూచించారు.