: మరికాసేపట్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు... తొలిసారిగా ‘తొలగింపు’ విధానంలో లెక్కింపు

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో మొదలు కానుంది. రెండు రోజుల క్రితం ఈ కోటా కింద ఆరు ఎమ్మెల్సీ సీట్లకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ ఓట్ల లెక్కింపులో తొలిసారిగా ‘తొలగింపు’ పద్ధతిని అవలంబించనున్నారు. అంటే తొలుత చెల్లని ఓట్లను తొలగించిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నమాట. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, ఆయా పార్టీల అభ్యర్థులను తన వైపు తిప్పుకోగలిగిన టీఆర్ఎస్ ఆరింటిని ఏకగ్రీవంగానే దక్కించుకుంది. ఇక మిగిలిన ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనన్న వాదన వినిపిస్తోంది. నేటి మధ్యాహ్నంలోగా పూర్తి స్థాయి ఫలితాలు విడుదల కానున్నాయి.

More Telugu News