: పదో తరగతి బాలికను వేధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై నిర్భయ కేసు
పదో తరగతి బాలికను వేధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదైంది. కృష్ణా జిల్లా తిరువూరులోని విజయ బాలానికేతన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో మర్చిపోయిన పుస్తకాలను తీసుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒంటరిగా స్కూలుకు వచ్చిన పదో తరగతి బాలికతో విజయ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక, తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో బాలిక తండ్రి తిరువూరు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతనిపై నిర్భయ చట్టంపై కేసు నమోదు చేశారు.